Abn logo
Sep 19 2021 @ 10:13AM

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు బంద్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సమాచార శాఖ ఫోన్లు బంద్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖకు చెందిన ఉద్యోగుల సెల్ ఫోన్లు అన్నీ మూగబోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీసును నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్లు పనిచేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 13 జిల్లాలకు సంబంధించి మొత్తం సమాచారశాఖ అధికారుల ఫోన్లు బంద్ అయ్యాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏదైనా సమాచారం  ఇవ్వాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, మీడియా ప్రతినిధులు వెళ్లే అవకాశం లేదు. దీంతో వారికి సమాచారం ఇవ్వాలన్నా ఫోన్లు పనిచేయడంలేదు. సమాచార శాఖలోని ముఖ్య అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ఫోన్లు బంద్ అయ్యాయి. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా సమాచార శాఖలో ఫోన్లు బంద్ కావడం ఇది రెండోసారి.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...