నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం 30,580 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో.. ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 12,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.