టోకు ధరలు... ద్రవ్యోల్బణం... వరుసగా పదవ నెలలో 10 % కంటే ఎక్కువ..

ABN , First Publish Date - 2022-02-14T22:44:41+05:30 IST

టోకు ధరల ద్రవ్యోల్బణం 2021 డిసెంబరులో 13.56 % కాగా, జనవరిలో నాలుగు నెలల కనిష్టానికి 12.96 % కు పడిపోయింది, గత ఏప్రిల్ నుండి... ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 10 % కంటే తగ్గుదల ఎక్కువగా ఉంది.

టోకు ధరలు... ద్రవ్యోల్బణం...   వరుసగా పదవ నెలలో 10 % కంటే ఎక్కువ..

న్యూఢిల్లీ : టోకు ధరల ద్రవ్యోల్బణం 2021 డిసెంబరులో 13.56 % కాగా, జనవరిలో నాలుగు నెలల కనిష్టానికి 12.96 % కు పడిపోయింది, గత ఏప్రిల్ నుండి... ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 10 % కంటే తగ్గుదల ఎక్కువగా ఉంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం డిసెంబరులో 10.62 % నుంచి జనవరిలో 9.42 % కు తగ్గింది. ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం డిసెంబరులో 32.30 % నుండి జనవరిలో 32.27% కు  మారనప్పటికీ... ప్రాథమిక వస్తువులు, ఆహార సూచికల కోసం జనవరిలో టోకు స్థాయిలో ధరల పెరుగుదల నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరులో 9.2 % నుండి 9.6 % కు... అంటే... 24 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది, డిసెంబరులో 31.6 % నుండి కూరగాయల ధరలు 38.5 %, డిసెంబరులో 6.7 % నుండి గుడ్లు, మాంసం,  చేపల ధరలు 9.8 % పెరిగాయి. కూరగాయలు సహా ఆయా అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


గత ఆర్ధిక సంవత్సరం(2021-22) నాటికి పది శాతం కంటే ఎక్కువగా ఉండి, నవంబరులో గరిష్ట స్థాయి 14.9 % కి చేరిన తర్వాత ధరలకు సంబంధించిన టోకు ధరల సూచిక (డబ్ల్యుపీఐ) ద్వారా నమోదైన ద్రవ్యోల్బణం రెండంకెల కంటే ఎక్కువగా ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా. ‘భౌగోళిక, రాజకీయ ఆందోళనల కారణంగా ముడిచమురు ధరల్లో నిరంతర పెరుగుదలతోపాటు రూపాయిపై ప్రభావం... ప్రస్తుత త్రైమాసికంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణానికి భారీ విఘాతాన్ని కలిగిస్తుంది’ అని ఐసీఆర్‌ఏ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ‘ప్రాథమిక ఆహార సరకులకు సంబంధించి అనూహ్యమైన తిరోగమనమున్నప్పటికీ, ముడి చమురు ధరలు పనెరుగుదల తదితర పరిణామాల నేపధ్యంలో... రానున్న రెండు నెలల కాలంలో... డబ్ల్యైూపీఐ ద్రవ్యోల్బణం 10.5-12 % మేర చోటుచేసుకోనున్నట్లుగా భావిస్తున్నారు. 


ఇక... ఇంధనం మరియు విద్యుత్తు ద్రవ్యోల్బణంలో, మినరల్ ఆయిల్ ఇండెక్స్ డిసెంబరులో 62.6 % నుండి జనవరిలో 52.2 % కు తగ్గిపోగా, డిసెంబరులోని -0.2 %తో పోలిస్తే విద్యుత్తు ధరలు 15.7 % ద్రవ్యోల్బణాన్ని నమోదు చేయడం ద్వారా భారీ తేడాలు చోటుచేసుకున్నాయి. ద్రవ్య విధాన ప్రయోజనాల కోసం టోకు ధరల సూచికను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించకపోయినప్పటికీ... వినియోగదారు ధరల సూచిక(సీపీఐ) కంటే ప్రపంచ ధరలను ప్రతిబింబించే ధోరణితో చూడడమన్నది పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. 

Updated Date - 2022-02-14T22:44:41+05:30 IST