పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-28T06:26:54+05:30 IST

పెంచిన ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ కోరారు. ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిప్రతం అంజేశారు

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి
చౌటుప్పల్‌లో ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన

అధికారులకు వినతిపత్రాల అందజేత

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మే 27: పెంచిన ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ కోరారు. ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిప్రతం అంజేశారు.  చౌటుప్పల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలనీ ఆయన డిమాండ్‌ చేశారు. పెంచిన వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని,  ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేపి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించా లని ఆయన కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7500లు ఇవ్వాలని. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో సూరజ్‌ కుమార్‌కు  అందజేశారు.  కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదిర్శ పల్లె శేఖర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్‌ రెడ్డి, సీపీఎం నాయకులు ఎండీ పాష, బూరుగు కృష్ణారెడ్డి పాల్గొన్నారు



Updated Date - 2022-05-28T06:26:54+05:30 IST