పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-22T05:00:49+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు తగ్గించాలని ఏఐ వైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుతూబ్‌ డిమాం డ్‌ చేశారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

అమరచింత, జూన్‌ 21: కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు తగ్గించాలని ఏఐ వైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుతూబ్‌ డిమాం డ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ ముందు వినూత్న రీతిలో నిరసన  చేపట్టారు. పెట్రో ల్‌ బంక్‌కు వచ్చే వాహనదారుల కు ఏఐవైఎఫ్‌ నాయకులు గులాబీ పూలను ఇస్తూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే వరకు నిరసనకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏ ఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుతూబ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వేస్తూ సామాన్య జనంపై భారం మోపుతున్నారని ఆందోళన చెందారు. అన్ని వ స్తువులపైన జీఎస్టీని అమ లు చేస్తున్నా పెట్రోల్‌, డీజిల్‌పై ఎందుకు జీఎస్టీని అమలు చే యడం లేదని ప్రశ్నించారు. ధరలు తగ్గించే వరకు ప్రజాఉద్యమం చేపడుతామన్నారు.  కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నా యకులు భాస్కర్‌, రఘు, నవీన్‌, శేఖర్‌, రాజు, సలీం, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:00:49+05:30 IST