పెంచిన బస్ చార్జీలను ఉపసంహరించుకోవాలి: CPI

ABN , First Publish Date - 2022-07-01T21:04:16+05:30 IST

చిత్తూరు: ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు పేరుతో జూలై 1వ తేదీ నుంచి బస్ చార్జీలను పెంచింది. ఈ పెంపును నిరసిస్తూ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను

పెంచిన బస్ చార్జీలను ఉపసంహరించుకోవాలి: CPI

చిత్తూరు: డీజిల్ సెస్ పెంపు పేరుతో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)  జూలై 1వ తేదీ నుంచి బస్ చార్జీలను పెంచింది. ఈ పెంపును నిరసిస్తూ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అని టీడీపీపై విమర్శలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు.   

ఆర్టీసీ బాదుడు ఇలా...

పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుత కనీస చార్జీ పది రూపాయలు. తొలి 30 కిలోమీటర్లకు ఎలాంటి పెంపు ఉండదు. ఆ తర్వాత ప్రయాణ దూరాన్ని బట్టి రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.20వరకు పెంచారు. అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో చార్జీ రూ.25వరకూ వడ్డించారు. ఎక్స్‌ప్రెస్‌ సర్సీసులకు మొదటి 35 కిలోమీటర్లకు చార్జీ పెంపు ఉండదు. ఆ తర్వాత... రూ.5 పెంపుతో బాదుడు మొదలవుతుంది. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.5, 25, 35, 55, 75 చొప్పున పెంచుతూ పోయారు. గరిష్ఠంగా 500 కిలోమీటర్ల ప్రయాణంపై రూ.90 అదనపు బాదుడు పడుతుంది. అల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో తొలి 21 కిలోమీటర్లకు ఎలాంటి పెంపు ఉండదు. ఆ తర్వాత... రూ.5తో బాదుడు మొదలై గరిష్ఠంగా రూ.120 వరకు ఉంటుంది.  సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.10 అదనంగా డీజిల్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. అయితే 55 కిలోమీటర్ల తర్వాత ప్రతి స్టేజీకి పది రూపాయల చొప్పున భారం మోపుతూ 500 కిలోమీటర్లకు రూ.120 బాదేశారు. ఏసీ సర్వీసు ‘ఇంద్ర’ బస్సుల్లో 36 కిలోమీటర్ల తర్వాత రూ.10తో బాదుడు మొదలవుతుంది. 210కిలో మీటర్ల ప్రయాణానికి రూ.50, 356 కిలోమీటర్లకు రూ.100, 500 కిలోమీటర్లకు రూ.140 అదనపు భారం మోపారు. గరుడ, అమరావతి, నైట్‌ రైడర్‌, వెన్నెల బస్సులకూ ఇదే పెంపు వర్తిస్తుంది. 


Updated Date - 2022-07-01T21:04:16+05:30 IST