రేట్లు పెంచి దోపిడీ!

ABN , First Publish Date - 2021-07-28T06:46:36+05:30 IST

బేస్‌లైన్‌ పరీక్షల ప్రశ్నపత్రాల రేట్లు పెంచారు. మరో 4 రోజులు మాత్ర మే సమయం ఉండటంతో ఎడాపెడా రేట్లు పెంచి ఓ ప్రిం టర్‌, పబ్లిషర్‌ దోపిడీకి తెరతీశారు.

రేట్లు పెంచి దోపిడీ!
పాత డీఈఓ ఆఫీస్‌ సమీపంలో ఓ పబ్లికేషన్స్‌ వద్ద ప్రశ్నపత్రాలతో టీచర్లు సందడి

ప్రశ్నపత్రాల కోసం క్యూకట్టిన టీచర్లు చోద్యం చూస్తున్న అధికారులు

మార్కెట్‌లో ప్రశ్నపత్రాలపై జేసీ సిరి ఆరా


అనంతపురం విద్య, జూలై 27 : బేస్‌లైన్‌ పరీక్షల ప్రశ్నపత్రాల రేట్లు పెంచారు. మరో 4 రోజులు మాత్ర మే సమయం ఉండటంతో ఎడాపెడా రేట్లు పెంచి ఓ ప్రిం టర్‌, పబ్లిషర్‌ దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ నిర్వహిస్తున్న బేస్‌లైన్‌ పరీక్షలకు ప్రైవేట్‌ పబ్లిషర్లు, ప్రింటర్లు ముద్రించి న ప్రశ్నపత్రాలు వినియోగించకూడదంటూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులున్నా యి. అయితే వారు నిబంధనలకు విరుద్ధంగా ముద్రిం చి విక్రయిస్తున్నారు. తామే ప్రశ్న పత్రం రూ పొందించుకుని పరీక్షలు పెట్టాల్సిన ఉపాధ్యాయులు సైతం పబ్లికేషన్స్‌, ప్రింటర్స్‌ వద్దకు క్యూకట్టారు.


అందరికీ ఒకటే పేపర్‌

విద్యార్థుల సామర్థ్యాలను బట్టి టీచర్లే పేపర్లు తయా రు చేసి ఇవ్వాలి. అయితే నిబంధనలను ఉల్లంఘించిన జిల్లా లోని ఓ పబ్లికేషన్స్‌, ఓ ప్రింటర్‌ తమ స్వలాభం కోసం మోడల్‌ పేపర్‌ను ప్రింట్‌ చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో అందరికీ ఒకటే ప్రశ్నపత్రం అందుతుంది. వివిధ రకాల (టైప్స్‌) ప్రశ్న పత్రాలు విద్యార్థుల చేతికి రావాల్సిఉన్నా...అందరికీ కామన్‌ పేపర్‌ రావడంతో... మూ సధోరణిగా మారుతోంది. పైగా ప్రభుత్వం నిర్వహించాలనుకున్న  బేస్‌లైన్‌ పరీక్షల లక్ష్యం నీరుగారుతోం ది. దీనికితోడు రెండు రోజుల కిందట లెవల్‌ -1 పేపర్‌ ధర రూ. 2 ఉండగా దాన్ని రూ. 3లకు ఒక పబ్లికేషన్స్‌ సంస్థ పెంచేసింది. మరో ప్రింటర్స్‌ సైతం రూ.3, రూ.4ల ప్రశ్నపత్రాల ధరలను పెంచారు. మరో 4  రోజులు మాత్రమే సమయం ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి భారీగా సొమ్ము చేసుకోడానికి సైతం ప్రైవేట్‌ పబ్లికేషన్స్‌, ప్రింటర్స్‌ కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకుల ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. 


చోద్యం చూస్తున్న డీఈఓ...

జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుటే బహిరంగంగా ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే...విద్యాశాఖాధికారులు మౌ నంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. క్వశ్చన్‌పేపర్లు టీచర్లే రూపొందించి ఇవ్వాలంటూ డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులను కొందరు ఉపాధ్యాయులే తుంగ లో తొక్కుతున్నారు. ఉన్నతాధికారైన డీఈఓ ఆదేశాలు బేఖాతర్‌ చేసి...బయట మార్కెట్‌లో ప్రశ్నపత్రా లు కొంటున్నారు.  తమ కార్యాల యం ఎదుటే ఇంత జరుగుతున్నా అధికారులు చేష్టలు డిగి చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


డీఈఓతో విచారణ చేయిస్తా : జేసీ సిరి

బేస్‌లైన్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు బహిరంగ మార్కెట్‌లో అమ్మడంపై జేసీ సిరి ఆరా తీశారు. మార్కెట్‌లో ప్రశ్న పత్రాలు శీర్షికన  మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో క థ నం ప్రచురితమైంది. దీనిపై ఆమె ఆరా తీశారు.  ప్రశ్నపత్రాలు బయట ముద్రించడం ఏంటన్న దానిపై ఉదయం విచారణ చేయించమని చెప్పానన్నారు. కా మన్‌ పేపర్‌ అయితే అది ఎగ్జామ్‌ అవ్వదని, ఇది సబబుకాదన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారితో విచారణ చేస్తానని జేసీ సిరి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-07-28T06:46:36+05:30 IST