ఇన్‌ఫ్లమేషన్‌ ఇలా దూరం

ABN , First Publish Date - 2021-10-26T08:41:48+05:30 IST

శరీరంలో అంతర్గతంగా చోటుచేసుకునే ఇన్‌ఫ్లమేషన్లు పలు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే చిట్కాలు పాటిస్తూ ఉండాలి.

ఇన్‌ఫ్లమేషన్‌ ఇలా దూరం

గుడ్‌ హెల్త్‌

శరీరంలో అంతర్గతంగా చోటుచేసుకునే ఇన్‌ఫ్లమేషన్లు పలు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే చిట్కాలు పాటిస్తూ ఉండాలి.

 త్రేన్పులు: గ్యాస్టైటి్‌సలో కనిపించే సాధారణ లక్షణం ఇది. జీర్ణాశయం లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్‌కు గురైందని ఈ లక్షణం ద్వారా అర్థం చేసుకోవాలి. దీన్ని తొలగించుకోవడం కోసం అల్లం టీ తాగాలి.

బ్లోటింగ్‌: శరీరంలో అదనంగా గ్యాస్‌ చేరుకోవడం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఒక గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌తో ఈ సమస్య అదుపులోకి వస్తుంది.

ఒళ్లు మంటలు: విటమిన్‌ డి లోపం ఈ లక్షణంతో బయల్పడుతుంది. చేప నూనె సప్లిమెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా ఉపయోగపడతాయి.

కండరాల నొప్పులు: ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల తలెత్తే ఈ రకమైన ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడం కోసం గ్లాసు నీళ్లలో ఒక టీస్పూను యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ కలుపుకొని తాగాలి.

Updated Date - 2021-10-26T08:41:48+05:30 IST