మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5’

ABN , First Publish Date - 2020-08-14T00:43:33+05:30 IST

అతిపెద్ద డిస్‌ప్లే, బ్యాటరీతో ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5’ మార్కెట్లోకి వచ్చేసింది. సింగిల్ ర్యామ్, స్టోరేజీ కన్ఫిగరేషన్‌తో

మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5’

న్యూఢిల్లీ: అతిపెద్ద డిస్‌ప్లే, బ్యాటరీతో ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5’ మార్కెట్లోకి వచ్చేసింది. సింగిల్ ర్యామ్, స్టోరేజీ కన్ఫిగరేషన్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ సింగిల్ వేరియంట్ కలిగిన ఈ ఫోన్‌ ధర వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. 


ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్), 6.6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్,  13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా,  64జీబీ అంతర్గత మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10W చార్జింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటివి ఉన్నాయి. 


Updated Date - 2020-08-14T00:43:33+05:30 IST