Abn logo
May 23 2020 @ 20:10PM

29న భారత మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ హాట్ 9’ సిరీస్ ఫోన్లు

Kaakateeya

న్యూఢిల్లీ: ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు ఈ నెల 29న భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫోన్ల విడుదలకు సంబంధించిన ఇన్ఫినిక్స్ ఈ నెల 20 సోషల్ మీడియాలో టీజ్ చేసింది. ఈరోజు ఈ ఫోన్లకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ మరిన్ని విషయాలు వెల్లడించింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు.. ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రొ ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఇండోనేషియాలో విడుదల చేసిన ఫోన్‌కు ఇన్ఫినిక్స్ హాట్ 9 సేమ్ మోడల్ కాగా, 9ప్రొ దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్.


ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రొ స్పెసిఫికేషన్లు: 6.6 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనకవైపు 48 ఎంసీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ కెమెరా వంటివి ఉన్నాయి.  

Advertisement
Advertisement