అనంతలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-19T05:38:03+05:30 IST

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.

అనంతలో భారీ వర్షం
జమ్మానిపల్లి వద్ద కర్ణాటకకు పోతున్న నీరు

అనంతపురం అర్బన/ న్యూస్‌ నెట్‌వర్క్‌, మే 18: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. అనంతపురం జిల్లాలోని 28 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 31 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలంలో 113.2 మి.మీ వర్షపా తం నమోదైంది. మడకశిర 98.2, రొద్దం 91.2, పెనుకొండ 82.8, బొమ్మనహాళ్‌ 69.0, ఉరవకొండ 60.2, బ్రహ్మసముద్రం 46.2, గుమ్మఘట్ట 45.4, కళ్యాణదుర్గం 44.4, డీ.హీరేహాళ్‌ 36.6, రాయదుర్గం 36.4, కంబదూరు 35.4, కూడేరు 33.4, తాడిపత్రి 32.2, కణేకల్లు 30.0, కుందుర్పి 29.6, పెద్దపప్పూరు 28.6, శెట్టూరు 24.6, రాప్తాడు 23.8, రామగిరి 64.2, కనగానపల్లి 63.2, హిందూపురం 54.2, సీకేపల్లి 52.4, అమడగూరు 46.6, గుడిబండ 41.2, అమరాపురం 40.0, అగళి 36.4, ఓడీచెరువు 35.2, ఎనపీకుంట 34.2 , సోమందేపల్లి 33.4, పరిగి 27.6, రొళ్ల 26.4 , చిలమత్తూరు 25.8 మి.మీ వర్ష పాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 23 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. బుధవారం సాయంత్రం అనంతపురం, నార్పల, శింగనమల, ముదిగుబ్బ, కదిరి, ఎనపీకుంట, నల్లమాడ, పుట్లూరు, మడకశిర, గార్లదిన్నె, తనకల్లు, సీకేపలి,్ల గుత్తి, రాప్తాడు, తాడిపత్రి, పెద్దవడుగూరు, బత్తలపల్లి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పామిడి, వజ్రకరూరు, యాడికి, బెళుగుప్ప, తలుపుల, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. 


నీట మునిగిన పత్తి.. తడిసిన వేరుశనగ, వరి..


బొమ్మనహాళ్‌, హరేసముద్రం, ఉద్దేహాళ్‌, శ్రీధరఘట్ట, సింగానహళ్లి, తదితర గ్రామాల్లో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. రొద్దంలో భారీ వర్షంతో పత్తిపొలాల్లోకి వర్షపు నీరు చేరింది. మండలంలోని గౌరాజుపల్లిలో రైతులు హరి, రాజప్ప, మాధవ, సురే్‌షల పత్తి పంట నీటమునిగింది. గుమ్మఘట్ట మండలంలోని వివిధ గ్రామాల్లో  వేరుశనగ పంట వర్షానికి తడిసి ముద్దయింది.  ఈదురుగాలులతో కూడిన వర్షానికి రంగసముద్రం తదితర ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. ఆత్మకూరులో రైతు కొండారెడ్డికి చెందిన రెండెకరాల్లో టమోటా పంట నీటమునిగింది. 


రామాలయ గోపురంపై పిడుగు 


బొమ్మనహాళ్‌లోని రామాలయం గోపురంపై పిడుగు పడటంతో గోపురంలోని  విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పిడుగుపాటు శబ్దానికి ఆలయ సమీపంలోని 100 కేవీ ట్రాన్సఫార్మర్‌ కాలిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం దాకా విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


పొంగిపొర్లిన వాగులు, వంకలు 


పెనుకొండలో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలకు నీరు చేరాయి. రొద్దం మండలంలోని ఆర్‌.మరువపల్లిలోని చిన్నవంక, పెద్దవంక నుండి పెన్నానదిలోకి అధికంగా వర్షపు నీరు చేరింది. దీంతో రొద్దకంపల్లి, గౌరాజుపల్లి, నారనాగేపల్లి ప్రాంతాల్లో  పెన్నానది వర్షపు నీటితో పరవళ్లు తొక్కింది. తాడంగిపల్లి గ్రామం వద్ద తాడంక పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి మడకశిర పరిధిలోని వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండాయి. ఎల్లోటి, మడకశిర, వైబీహళ్లి, గుండుమల, హరేసముద్రం చెరువులకు నీరుచేరాయి. జమ్మానిపల్లి గ్రామసమీపంలోని వంకలోని నీరంతా కర్ణాటక ప్రాంతానికి  పారాయి. కణేకల్లు పరిధిలోని వేదావతి, హగరి పొంగి పొర్లాయి. దీంతో పొలాల్లో కోత కోసి కుప్పలు వేసిన వరిధాన్యం తడిసిపోయింది. 


ఉడేగోళంలో ఇల్లు నే లమట్టం 


ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవ డంతో కణేకల్లు మండలం ఉడేగోళం గ్రామానికి చెందిన వసంతమ్మ అనే మహిళకు చెందిన ఇల్లు నేలమట్టమైంది. . వర్షం కురిసే సమయంలో ఇల్లు కూలుతుందనే భయంతో వసంతమ్మ కుటుంబ సభ్యులు బయటకు రాగానే కుప్పకూలినట్లు బాధితులు తెలిపారు. 


మెట్ట పొలాల్లో సేద్యం పనులకు సమాయత్తం  


ఖరీఫ్‌ సీజన ఆరంభానికి ముందే భారీ వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే మెట్ట పొలాల్లో దక్కులు దున్నుకున్నారు. తాజాగా కురిసిన వానకు తడి ఆరగానే దుక్కులు దున్నేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 


 కళ్యాణదుర్గంలో వరిధాన్యం నీటిపాలు


  కళ్యాణదుర్గం మండలంలోని మానిరేవు గ్రామంలో దాదాపు 90 బస్తాల ధాన్యం నీటిపాలైంది. దీంతో రైతు పోతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి ఉషశ్రీచరణ్‌ మానిరేవుమీదుగా నుసికొట్టాలకు వెళ్లారు. వరిపంటలు నీటమునిగాయని స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికి మంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో బాధిత రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

    



Updated Date - 2022-05-19T05:38:03+05:30 IST