25 నుంచి ఇన్ఫీ బైబ్యాక్‌

ABN , First Publish Date - 2021-06-24T08:40:24+05:30 IST

ఈ నెల 25న రూ.9,200 కోట్ల విలువైన కంపెనీ షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.

25 నుంచి   ఇన్ఫీ బైబ్యాక్‌

మొత్తం రూ.9,200 కోట్ల షేర్ల తిరిగి కొనుగోలు 

ఒక్కో షేరుకు గరిష్ఠంగా రూ.1,750 చెల్లింపు 


న్యూఢిల్లీ: ఈ నెల 25న రూ.9,200 కోట్ల విలువైన కంపెనీ షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు 24తో బైబ్యాక్‌ ఆఫర్‌ ముగియనుంది. బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేరుకు గరిష్ఠంగా రూ.1,750 చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్‌ 14న కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నెల 19న జరిగిన కంపెనీ 40వ వార్షిక సమావేశంలో వాటాదారుల నుంచీ అంగీకారం లభించింది.


 బైబ్యాక్‌లో గరిష్ఠంగా 5,25,71,428 షేర్లను (మార్చి 31 నాటికి కంపెనీ పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.23ు వాటాకు సమానం) బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయనుంది. బుధవారం బీఎ్‌సఈలో  ఇన్ఫోసిస్‌ షేరు 0.59 శాతం తగ్గి రూ.1,502.85 వద్ద స్థిరపడింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీకిది మూడో బైబ్యాక్‌. 2019 ఆగస్టులో మొత్తం రూ.8,260 కోట్లతో 11.05 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసిన ఇన్ఫీ.. 2017 డిసెంబరులో రూ.13,000 కోట్లతో 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసింది. 


మూడ్రోజుల ర్యాలీకి బ్రేక్‌ 

దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడ్రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. బుధవారం ట్రేడింగ్‌ నిలిచేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 282.63 పాయింట్ల నష్టంతో 52,306.08కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85.80 పాయింట్లు కోల్పోయి 15,686.95 వద్ద స్థిరపడింది. కాగా కింగ్‌ఫిషర్‌ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌)లో డచ్‌ బ్రూవరీ హైనెకెన్‌ వాటా మరింత పెరిగింది. తాజాగా 14.98 శాతం వాటా చేజిక్కించుకోవడంతో హైనెకెన్‌ మొత్తం వాటా 61.50 శాతానికి చేరుకుంది. 

Updated Date - 2021-06-24T08:40:24+05:30 IST