చీపురుగూడెంలో గౌరవ సభ ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి
నల్లజర్ల, డిసెంబరు 2: ప్రభుత్వ అసమర్ధ పాలనతో సామాన్యులు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. చీపురుగూడెంలో గౌరవ సభ పేరిట ప్రజల సమస్యల చర్చా వేదిక కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోడవంతో వర్షలకు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పఽథకాలను రద్దు చేసిందన్నారు. మద్యం రేట్లు రెట్టింపు చేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటుందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, ఎంపీటీసీ రావూరి వెంకట రమణ, ఏలేటి సత్యనారాయణ, కొఠారు అనంతలక్ష్మి, గాంధీ, కూసంపూడి వెంకటేశ్వరరావు, తలంశెట్టి చిన్న వెంకట్రావు, చెల్లు పెద్దరామన్న, తదితరులు పాల్గొన్నారు.