INDvsSouth Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియా ఓపెనర్లుగా..

ABN , First Publish Date - 2022-06-10T00:12:16+05:30 IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం నాడు దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు..

INDvsSouth Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియా ఓపెనర్లుగా..

న్యూఢిల్లీ: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం నాడు దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కావడం గమనార్హం. రాహుల్‌ లేకపోవడంతో.. ఇషాన్‌తో కలసి రుతురాజ్‌ గైక్వాడ్‌ లేదా వెంకటేష్‌ అయ్యర్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. మూడో నెంబర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌, మిడిలార్డర్‌లో పంత్‌, హార్దిక్‌ పాండ్యా రానున్నారు. ఆరో నెంబర్‌లో దినేష్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా మధ్య పోటీ నెలకొనే చాన్సుంది. భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌తో బౌలింగ్‌ విభాగం బలంగానే కనిపిస్తోంది. కుల్దీప్‌ దూరమవడంతో.. స్నిన్నర్‌ చాహల్‌కు జోడీగా బిష్ణోయ్‌ రావొచ్చు. ఇక, దక్షిణాఫ్రికా జట్టు పొట్టి ఫార్మా ట్‌ ఆడి చాలా రోజులైంది. అయితే, ఐపీఎల్‌లో సత్తాచాటిన డికాక్‌, మిల్లర్‌, రబాడ, నోకియాలు టీమ్‌లో ఉండడం సౌతాఫ్రికాకు కలసి వచ్చేది. 


కెప్టెన్‌గా ప్రకటించిన కేఎల్‌ రాహుల్‌.. గాయం కారణంగా ఈ సిరీస్‌కే దూరమయ్యాడు. గజ్జల్లో గాయంతో అతడు సఫారీలతో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇక నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా చేతికి బంతి తగలడంతో స్పిన్నర్‌ కుల్దీప్‌ కుడి చేతికి గాయం కావడంతో.. సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. అయితే, భవిష్యత్‌ కెప్టెన్‌గా భావిస్తున్న రిషభ్‌ పంత్‌కు కెప్టెన్సీ అప్పగించారు. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పొట్టి వరల్డ్‌కప్‌ జట్టు ఆటగాళ్లపై స్పష్టత కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.


దక్షిణాఫ్రికా: క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), బవుమా (కెప్టెన్), హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పర్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, షంసి, రబడ, నోర్జే


టీమిండియా: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, అవీష్ ఖాన్

Updated Date - 2022-06-10T00:12:16+05:30 IST