Aug 4 2021 @ 12:59PM

'ఇందువదన' టీజర్: వరుణ్ సందేశ్ విశ్వరూపం

యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇందువదన'. తాజా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో వరుణ్ సందేశ్ మొదటిసారి తన చూపించడానికి సిద్దమవుతున్నాడు. 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన వరుణ్ సదేశ్ 'కొత్త బంగారు లోకం' సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అయితే మళ్ళీ ఆ స్థాయి విజయాలు అందుకుకోలేక రేస్‌లో వెనకబడ్డ ఈ హీరో 'ఇందువదన' సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇదేదో రొమాంటిక్ సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ తాజా టీజర్‌లో మాత్రం రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం హింట్ ఇచ్చింది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా చిత్ర టిజర్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై బాగానే అంచనాలను పెంచుతోంది. చూడాలి మరి ఇందువదన వరుణ్ సందేశ్‌కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.