రాజకీయాల్లో రోశయ్యలాంటి వ్యక్తులు అరుదు: అంబికా కృష్ణ

ABN , First Publish Date - 2021-12-04T19:04:02+05:30 IST

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత అంబికా కృష్ణ తీవ్ర సంతాపం తెలిపారు.

రాజకీయాల్లో రోశయ్యలాంటి వ్యక్తులు అరుదు: అంబికా కృష్ణ

ఏలూరు: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత అంబికా కృష్ణ తీవ్ర సంతాపం తెలిపారు. రాజకీయాల్లో రోశయ్యలాంటి వ్యక్తులు అరుదని అన్నారు.నేటి రాజకీయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రోశయ్య ఎంతో  సేవ చేశారని  అంబికా కృష్ణ అన్నారు. 


Updated Date - 2021-12-04T19:04:02+05:30 IST