ప్రతి మండలంలో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-06-25T06:10:11+05:30 IST

ప్రతి మండలంలో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు

ప్రతి మండలంలో ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు
మాట్లాడుతున్న రాహుల్‌ పాండే, పక్కన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశంలో ఏలూరు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఏలూరు రూరల్‌, జూన్‌ 24: ఏలూరుజిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి మండలంలో ఇండస్ర్టియల్‌ పార్కులు ఏర్పాటు చేయా లని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైన భూములు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్‌లో  శుక్రవారం నిర్వహించిన పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. సింగిల్‌ విండో పథకం కింద 15 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తోం దన్నారు. బ్యాంకు నుంచి రుణాలు సకాలంలో అందేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. సింగిల్‌ విండో పథకం కింద అనుమతులు, సబ్సి డీలపై అవగాహనకు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జాప్యం చేయకుండా సింగిల్‌ విండోలో అందిన దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేం ద్రం జనరల్‌ మేనేజర్‌ ఏసుదాసు, డీపీవో బాలాజీ, ఏపీ క్యాప్సియా చైర్మన్‌ వాసిరెడ్డి మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని చేరుకోండి
ఏలూరు కలెక్టరేట్‌: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, జగనన్న ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సాధించాలని గృహ నిర్మాణశాఖ రాష్ట్ర అదనపు కార్యదర్శి రాహుల్‌ పాండే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, గృహనిర్మాణ కార్పొరేషన్‌ ఎండీ ఎం.శివ ప్రసాద్‌ సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్మాణ పనుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిం చామన్నారు. గ్రామ స్థాయి నుంచి లబ్ధిదారులు నిర్మాణ పనుల వైపు మొగ్గుచూపేలా చూస్తున్నామన్నారు. జేసీ అరుణ్‌బాబు, గృహ నిర్మాణశాఖ పీడీ వేణుగోపాల్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ షేక్‌ షాజిద్‌, గృహనిర్మాణశాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:10:11+05:30 IST