కోడూరులో ఇండస్ట్రియల్‌ పార్కు

ABN , First Publish Date - 2022-07-07T06:23:33+05:30 IST

అనకాపల్లి మండలం కోడూరులో సుమారు 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కానున్నట్టు జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు.

కోడూరులో ఇండస్ట్రియల్‌ పార్కు
శ్రీధర్‌, డీఐసీ మేనేజర్‌

తొలివిడత 70 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ యూనిట్లు

చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులు

‘ఆంధ్రజ్యోతి’తో డీఐసీ మేనేజర్‌  జీఎం శ్రీధర్‌ 

అనకాపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కోడూరులో సుమారు 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కానున్నట్టు జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. బుధవారం ఆయన ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, ఈ పార్కులో మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) యూనిట్లను స్థాపిస్తారని చెప్పారు. మొత్తం 120 ఎకరాలను ఇండస్ట్రియల్‌ పార్కు కోసం కేటాయించగా, మొదటి విడతలో 70 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని ఆయన చెప్పారు. నక్కపల్లిలో నాలుగు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు సిద్ధమవుతున్నదని, త్వరలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ డెస్క్‌ విధానంలో సత్వరమే అనుమతులు ఇస్తున్నామని, దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో జపాన్‌కు చెందిన యొకొహామా ఏసీటీ అనే కంపెనీ టైర్ల ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని, త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ఎస్‌ఈజడ్‌లో అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీ రూ.200 కోట్లతో విస్తస్తున్నదని, దీనివల్ల మరింత మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-07-07T06:23:33+05:30 IST