పేదల భూములు గుంజుకొని ఇండస్ర్టియల్‌ పార్కా?

ABN , First Publish Date - 2022-01-20T06:16:35+05:30 IST

పేద రైతుల భూములు గుంజు కొని ఏర్పాటు చేసే ఇండస్ర్టియల్‌ పార్కు ఎవరి కోసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 72లో రైతులకు కేటాయించిన అసైన్మంట్‌ భూములను రైతులు, సీపీఎం నాయకులతో కలిసి బుధవారం పరిశీ లించారు. ఈ సర్వే నెంబర్‌లో 108 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకోవాలని చూస్తే సీపీఎం ఊరుకోదని రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హె

పేదల భూములు గుంజుకొని ఇండస్ర్టియల్‌ పార్కా?
భూములు పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

తుర్కపల్లి, జనవరి 19: పేద రైతుల భూములు గుంజు కొని  ఏర్పాటు చేసే ఇండస్ర్టియల్‌ పార్కు ఎవరి కోసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 72లో రైతులకు కేటాయించిన అసైన్మంట్‌ భూములను రైతులు, సీపీఎం నాయకులతో కలిసి బుధవారం పరిశీ లించారు. ఈ సర్వే నెంబర్‌లో 108 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకోవాలని చూస్తే సీపీఎం ఊరుకోదని రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఇండస్ట్రీయల్‌ పార్కులో రైతుల భూములు పోతే మండల కేంద్రంలో 65 కుటుంబాలు వీధిన పడతాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొతరాజు జహంగీర్‌, నాయకులు కోక్కొండ లింగయ్య, భూ నిర్వాసితులు కసిరబోయిన గోపాల్‌,బింగి కొమురయ్య, బోయిని బాలయ్య, యెల్లోజు వెంకటేశ్వర్లు, శేఖర్‌, సాయిలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:16:35+05:30 IST