ప్రభుత్వానికి పారిశ్రామిక వర్గాలు మద్దతివ్వాలి: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-08-13T07:35:52+05:30 IST

కొవిడ్‌ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గించడానికి వీలుగా ప్రభుత్వానికి అండగా నిలవాలని

ప్రభుత్వానికి పారిశ్రామిక వర్గాలు మద్దతివ్వాలి: గవర్నర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గించడానికి వీలుగా ప్రభుత్వానికి అండగా నిలవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కోరారు. సంక్షోభ నివారణలో పారిశ్రామిక, వాణిజ్య రంగం పాత్ర కీలకమైనదని, లక్షలాది మంది జీవనోపాధి ఇందులో ఇమిడి ఉందన్నారు. బుధవారం తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్‌భవన్‌ నుంచి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొవిడ్‌ నివారణలో ప్రధాన మంత్రి కూడా సకాలంలో స్పందించి.. ప్రాణనష్టం జరుగకుండా అడ్డుకోగలిగారని చెప్పారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఊతం కోసం కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ.. ఆర్థిక రంగం ఉద్ధీపనకు పనికొచ్చిందన్నారు. ఆర్థిక ఉద్ధీపనకు రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని కోరారు. కొవిడ్‌కు సంబంధించిన వివిధ రంగాలపై పరిశోధన, విశ్లేషణ, అవగాహన కల్పించడానికి ఆస్కీతో కలిసి, సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ కోవిడ్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కొవిడ్‌ నివారణకు కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి అందించామని తెలిపారు. ప్రభుత్వానికి పారిశ్రామిక వర్గాలు మద్దతివ్వాలి: గవర్నర్‌ హైద రాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వల్ల ఏర్పడిన

Updated Date - 2020-08-13T07:35:52+05:30 IST