‘పారిశ్రామికంలో’ దళితులకు వెన్నుపోటు

ABN , First Publish Date - 2020-08-12T09:36:47+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను సీఎం జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని దళిత్‌ ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ విమర్శించింది.

‘పారిశ్రామికంలో’ దళితులకు వెన్నుపోటు

  • నూతన పారిశ్రామిక విధానంపై దళిత్‌ పారిశ్రామిక సంఘం

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను సీఎం జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని దళిత్‌ ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ విమర్శించింది. ‘2015-20 పారిశ్రామిక విధానంలో ఈ వర్గాలకు ఉన్న రాయితీలను నూతన విధానంలో కోత కోసేశారు. పెట్టుబడి ప్రోత్సాహకం 45 నుంచి 35శాతానికి తగ్గించారు. అది కూడా మూడేళ్ల తర్వాత ఇస్తామన్నారు. మరోవైపు సేవా రంగానికి సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలు ఎవరూ ఇన్నోవా, జేసీబీ, లారీలు, బస్సుల వంటి వాహనాలు తీసుకోవడానికి అర్హులు కాకుండా పోయార’ని సంఘం జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల పారిశ్రామిక ఆకాంక్షలను కాలరాసేలా ఉన్న ఈ పారిశ్రామిక విధానాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యుడు దేవతోటి నాగరాజు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-08-12T09:36:47+05:30 IST