ఇండస్ టవర్స్ దూకుడు....

ABN , First Publish Date - 2021-09-17T01:40:33+05:30 IST

ఆటోమేటిక్ మార్గం ద్వారా వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వంటి నిర్ణయాల తర్వాత గురువారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో ఇండస్ టవర్ షేర్లు 15 శాతం పుంజుకుని, రూ. 279.35 కు చేరుకున్నాయి.

ఇండస్ టవర్స్ దూకుడు....

ముంబై : ఆటోమేటిక్ మార్గం ద్వారా వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వంటి నిర్ణయాల తర్వాత గురువారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో ఇండస్ టవర్ షేర్లు 15 శాతం పుంజుకుని, రూ. 279.35 కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24 న ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 282 కు దగ్గరగా ట్రేడవుతోంది. ఇండస్ టవర్స్ లిమిటెడ్(గతంలో భారతి ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్) టెలికాం మౌలిక సదుపాయాలనందిస్తోంది. వివిధ మొబైల్ ఆపరేటర్ల కోసం టెలికాం టవర్లు, కమ్యూనికేషన్ నిర్మాణ పనులను ఇండస్ టవర్స్ పర్యవేక్షిస్తుంది. 

Updated Date - 2021-09-17T01:40:33+05:30 IST