ఇండస్ ఇండ్ బ్యాంక్... రూ. 30 వేల కోట్ల సేకరణ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-26T01:11:14+05:30 IST

ఇండస్ ఇండ్ బ్యాంకు రూ. 30 వేల 0 కోట్లను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇండస్ ఇండ్ బ్యాంక్... రూ. 30 వేల కోట్ల సేకరణ లక్ష్యం

పూనే : ఇండస్ ఇండ్ బ్యాంకు రూ. 30 వేల 0 కోట్లను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్విటీ, రుణం ద్వారా వ్యాపారాభివృద్ధికి నిధులు సేకరించాలని యోచిస్తోంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ లేదా అమెరికన్ డిపాజిటరీ రసీదులు లేదా గ్లోబల్ డిపాజిటరీ రసీదులు వంటి ఏవైనా అనుమతించబడిన డెట్ సెక్యూరిటీలు లేదా ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్స్ లేదా కన్వర్టిబుల్ డెట్ సెక్యూరిటీల ద్వారా నిధుల సేకరణ ప్రతిపాదనను బ్యాంక్ బోర్డు ఆమోదించింది.


షేర్‌హోల్డర్ల ఆమోదం, రెగ్యులేటరీ ఆమోదాల స్వీకరణకు లోబడి అవసరమైన విదేశీ కరెన్సీలలో రూ. 30 వేల కోట్ల వరకు లేదా దానికి సమానమైన మొత్తాన్ని సేకరించాలని బ్యాంక్ ప్రతిపాదించింది. అయితే ఈ నగదును సేకరించేందుకు టైమ్‌లైన్‌ను బ్యాంకు వెల్లడించలేదు. ఆగస్టు 26 న జరగనున్న వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుతమున్న రూ. 857 కోట్ల నుంచి అధీకృత మూలధనాన్ని రూ. వెయ్యి  కోట్లకు పెంచే ప్రతిపాదనను బోర్డు ఇప్పటికే ఆమోదించింది. ప్రమోటర్ గ్రూపునకు, ఎంపిక చేసిన ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా గత సెప్టెంబరులో బ్యాంకు రూ. 3,288 కోట్లను సేకరించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-26T01:11:14+05:30 IST