Abn logo
Sep 16 2021 @ 12:37PM

రెడ్ సిగ్నల్ పడగానే రోడ్డుపైకి దూసుకొచ్చి ఓ యువతి అనూహ్య చర్య.. వీడియో వైరల్ కావడంతో కొత్త కష్టం..!

అది ఇండోర్‌లోని బిజీ జంక్షన్.. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలన్నీ ఆగాయి.. ఆ సమయంలో అనూహ్యంగా రోడ్డు పైకి వచ్చిన ఓ యువతి అక్కడే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.. దీంతో వాహనదారులందరూ ఆమెను చూస్తూ ఉండిపోయారు.. నడిరోడ్డుపై తన డ్యాన్స్‌ను ఆ యువతి వీడియో తీయించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్ కావడంతో ఆమె కష్టాల్లో చిక్కుకుంది. 



ఇండోర్‌కు చెందిన శ్రీయ కర్లా అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నాలుగు రోజుల క్రితం ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రకారం.. ఇండోర్‌లోని బిజీగా ఉండే రసోమా స్క్వేర్‌ వద్ద రెడ్ సిగ్నల్ పడగానే శ్రీయ రోడ్డు మీదకు వెళ్లి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. 


మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ వీడియోను చూసి సదరు యువతిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. డ్యాన్స్ వేయడం కంటే ముందు ఆమె మాస్క్ లేకుండానే రోడ్డుపై కనిపించింది. రోడ్డుపై ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడం వంటి నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...