STF arrests:గోడ లోపల ఛాంబర్‌లో రహస్యంగా దాచిన డబ్బు

ABN , First Publish Date - 2021-08-05T12:55:20+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ పోలీసు టాస్క్‌ఫోర్స్ హవాలా రాకెట్ గుట్టును రట్టు...

STF arrests:గోడ లోపల ఛాంబర్‌లో రహస్యంగా దాచిన డబ్బు

రూ.70.10లక్షలు స్వాధీనం...ఏడుగురి అరెస్ట్ 

ఇండోర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ పోలీసు టాస్క్‌ఫోర్స్ హవాలా రాకెట్ గుట్టును రట్టు చేసింది.ఇండోర్ నగరంలో హవాలా గుట్టుగా సాగుతుందని పోలీసలుకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ పోలీసు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు.ఇండోర్ నగరంలోని  జవారా ప్రాంతంలోని నకోడ కాంప్లెక్సులోని ఫ్లాటులోని ఓ గోడలోపల రహస్యంగా నిర్మించిన ఛాంబర్‌లో రూ.70.10లక్షలున్నాయని స్పెషల్ పోలీసు టాస్క్‌ఫోర్స్ పరిశీలనలో తేలింది. దీంతో రహస్యంగా దాచిన హవాలా రాకెట్ డబ్బును ఎస్టీఎఫ్ స్వాధీనం చేసుకుంది. కరెన్సీ నోట్ల కట్టలతోపాటు నగదు కౌంటింగ్ మిషన్, 9 మొబైల్ ఫోన్లు, క్యాలిక్యురేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హవాలా రాకెట్ నడుపుతున్న గుజరాత్ రాష్ట్రానికి  చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని, దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ మనీష్ ఖత్రి చెప్పారు.


Updated Date - 2021-08-05T12:55:20+05:30 IST