Indore Dancing Cop: ఈ ట్రాఫిక్ పోలీసు అన్నది ఎంత మంచి మనసో కదా.. కాళ్ల మీద నిల్చోమనడమే కాదు..

ABN , First Publish Date - 2022-06-01T01:24:30+05:30 IST

అతనొక ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెత్తి మీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా.. విధి నిర్వహణలో మునిగి ఉన్నాడు. అంతలోనే ఇద్దరు చిన్నారులు రోడ్డుపై కంట పడ్డారు. రోడ్లపై చెత్త ఏరుకునే చిన్నారులు..

Indore Dancing Cop: ఈ ట్రాఫిక్ పోలీసు అన్నది ఎంత మంచి మనసో కదా.. కాళ్ల మీద నిల్చోమనడమే కాదు..

అతనొక ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెత్తి మీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా.. విధి నిర్వహణలో మునిగి ఉన్నాడు. అంతలోనే ఇద్దరు చిన్నారులు రోడ్డుపై కంట పడ్డారు. రోడ్లపై చెత్త ఏరుకునే చిన్నారులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా వారిలో ఒక చిన్నారి కాళ్లకు చెప్పులు లేకపోవడంతో కాళ్లు మండిపోతున్నాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ రంజిత్ సింగ్ దగ్గరకు వెళ్లి రోడ్డు దాటించేందుకు సహాయం చేయాలని కోరారు. అప్పటికే సిగ్నల్ ఆన్ కావడంతో కొంచెం సేపు ఆగమని చెప్పారు రంజిత్. ‘త్వరగా రోడ్డు దాటించండి సర్‌.. కాళ్లు మండిపోతున్నాయ్’ అని చెప్పడంతో రంజిత్‌ సింగ్‌ ఆ చిన్నారిని తన పాదాలపై నిలబడమని చెప్పాడు. కానిస్టేబుల్ చెప్పినట్టుగానే ఎండ వేడిని తట్టుకోలేక చిన్నారి కానిస్టేబుల్ పాదాలపై నిలబడ్డాడు. రెడ్‌ సిగ్నల్ పడగానే ఆ ఇద్దరిని రంజిత్‌ సింగ్‌ రోడ్డు దాటించారు.



ఈ ఘటనను అక్కడే ట్రాఫిక్‌లో ఉన్న కొంత మంది ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రంజిత్ సింగ్.. ఆ చిన్నారి తన పాదలపై కాళ్లు పెట్టినప్పుడు.. దేవుడే తనపై కాలు మోపినట్టు అనిపించింది అంటూ ట్వీట్ చేశారు. రోడ్డు దాటించిన అనంతరం వారికి చెప్పులు, బట్టలు కొని పంపించాడు. రంజిత్ సింగ్‌ చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. గతంలోనూ రంజిత్‌ సింగ్ డాన్సింగ్‌ కానిస్టేబుల్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. డ్యాన్స్‌ చేస్తూ రోడ్డుపై ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తుంటారు రంజిత్ సింగ్.

Updated Date - 2022-06-01T01:24:30+05:30 IST