ఇండోర్‌ ప్లాంట్స్‌.. క్రిముల్ని సంహరించే హీరో

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

బ్యాక్టీరియా, వైరస్‌లను అంతమొందించే పసుపులో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి...

ఇండోర్‌ ప్లాంట్స్‌.. క్రిముల్ని సంహరించే హీరో

బ్యాక్టీరియా, వైరస్‌లను అంతమొందించే  పసుపులో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి... 

 మనదేశంలో ఏ శుభకార్యానికికైనా పసుపు ఉండాల్సిందే. ఇంటి గడపకైనా, తినే వంటలో అయినా పసుపు ఉండాల్సిందే. గాలిలోని క్రిములను ఇంట్లోకి రానివ్వకుండా కాపాడే ఆ పసుపే ఒంట్లోని క్రిమిలను సంహరించే క్రిమిసంహారిగా ఉపయోగపడుతుంది. గాయాలకు పసుపుని రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

 శరీరంలోని వాపుల్ని తగ్గించే గుణం దీనికి ఉంది. యాంటీ సెప్టిక్‌గా, యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది.

 అల్లం జాతికి చెందిన పసుపు దుంపల్లో కర్క్యుమిస్‌ అనే పదార్థం ఉండటం వల్ల సహజమైన పసుపు రంగు వాటికి వచ్చింది. కర్క్యుమిస్‌ అనే పదార్ధం ఉండటం వల్లే శారీరక సౌందర్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లో పసుపును విరివిగా వాడతారు. 

 మసాలాల్లో పసుపు ఉండాల్సిందే. పులిహోర దగ్గర నుంచి మటన్‌ వరకూ పసుపు లేకుండా ఆహారాన్ని ఊహించలేం. ఒంట్లోని కొలెస్ర్టాల్‌ను తగ్గించడంతో పాటు బ్లడ్‌ప్రెజర్‌ను నియంత్రించే గుణం పసుపులో ఉంది. 

దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణం సాఫీగా జరుగుతుంది. కాళ్ల పగుళ్లకు పసుపును పట్టిస్తే చక్కని ఫలితం ఉంటుంది. 

 రక్తశుద్ధిని చేస్తుంది. వేడి పాలల్లో పసుపు వేసి తాగితే కఫం తగ్గుతుంది. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరిని గట్టిగా పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

 కూరల్లో, ఇతర విధానాల్లో.. ఏదో రూపంలో పసుపును కడుపులోకి తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. 

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST