Abn logo
Sep 18 2021 @ 17:44PM

కొబ్బరి చిప్ప మాస్క్ కొంపముంచింది..

ప్రపంచ వ్యాప్తంగా తగ్గినట్లే కరోనా విజృంభిస్తోంది. ఈ కారణంగానే ప్రతిఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించడం అలవాటు చేసుకున్నారు. కొందరు వ్యక్తులైతే సరికొత్త ప్రయోగాలకు తెరలేపుతున్నారు. రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్‌ను చిత్ర విచిత్ర రూపాల్లో తయారు చేసి జనాలకు షాకిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి మాస్క్‌నే తయారు చేశారు. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. వాస్తవానికి మాస్క్‌ను వస్త్రంతోనే చేస్తే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఈ వ్యక్తి దానిని కొబ్బరి చిప్పతో తయారు చేశారు.


ఇండోనేషినయాకు చెందిన నంగ బియానా ఒక పార్కింగ్ స్థలంలో పని చేస్తున్నారు. అది పార్కింగ్ ప్లేస్ కావడంతో ఎప్పుడూ విజిల్ వేయాల్సి ఉంటుంది. దాని కోసం మళ్లీ మళ్లీ మాస్క్ తీయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో నంగకి ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. వెంటనే కొబ్బరి చిప్పతో ప్రయోగానికి తెరలేపారు. సరికొత్త మాస్క్‌ను సృష్టించారు. కొబ్బరి చిప్పకు రెండు చివరల చెవులకు తాకించేలా రబ్బరు దారాలను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరి చిప్పకు చిన్న రంధ్రం చేసి దానికి విజిల్‌ను ఫిక్స్ చేశారు. విజిల్ వేసేందుకు మళ్లీ మళ్లీ మాస్క్ తీయాల్సిన పని లేదని నంగ చెబుతున్నారు. అయితే ఈ మాస్క్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొబ్బరి చిప్ప మాస్క్‌కు ఫిదా అయిపోతున్నారు. 

ఇది ఇలా ఉంటే నంగ రూపొందించిన ప్రత్యేక మాస్క్ అతనికి సమస్యలు కొని తెచ్చింది. విషయం తెలిసిన స్థానిక పోలీసులు కరోనా మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ చురకలు అంటించారు. ఆ మాస్క్ ప్రామామాణికమైన మాస్క్ ధరించాలని సూచించారు. అయితే విజిల్ వేయడంలో ఇబ్బందిగా ఉందని, ఆ కారణంగానే కొబ్బరి చిప్పను ఉపయోగించి మాస్క్ తయారు చేసుకున్నానని పోలీసులకు నంగ వివరణ ఇచ్చుకున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...