కరోనా ఎఫెక్ట్: సంబరంతో డ్యాన్సులు చేసిన ఖైదీలు!

ABN , First Publish Date - 2020-04-10T04:47:48+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇండోనేషియా ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతోంది. జైళ్లలో ఉన్న కొందరిని పెరోల్‌పై విడిచిపెడుతోంది. తాజాగా సులవేసీలోగల గొరంటాలో జైల్లోని కొందరు ఖైదీలు ఇదే విధంగా స్వేఛ్చా వాయువులు పీల్చుకున్నారు. పెరోల్ పొందిన వారు జైలు లోంచి బయటకు వస్తూ సంబరంతో డ్యాన్సులు చేశారు.

కరోనా ఎఫెక్ట్: సంబరంతో డ్యాన్సులు చేసిన ఖైదీలు!

గోరొంటాలో: కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇండోనేషియా ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతోంది. జైళ్లలో ఉన్న కొందరిని పెరోల్‌పై విడుదల చేస్తోంది. తాజాగా సులవేసీలోగల గొరంటాలో జైల్లోని కొందరు ఖైదీలు ఇదే విధంగా స్వేఛ్చా వాయువులు పీల్చుకున్నారు. పెరోల్ పొందిన వారు జైలు లోంచి బయటకు వస్తూ సంబరంతో డ్యాన్సులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరస్ అవుతోంది. అయితే ఈ వీడియోను జైలు అధికారులే రికార్డు చేయడం గమనార్హం. ఇక కరోనా కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం ఇటీవల 30 వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది.

Updated Date - 2020-04-10T04:47:48+05:30 IST