ఇండొనేషియాలో 24 గంటల్లో 585 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-04T23:42:25+05:30 IST

ఇండొనేషియాలో గురువారం 585 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇండొనేషియాలో 24 గంటల్లో 585 కరోనా కేసులు

జకర్తా: ఇండొనేషియాలో గురువారం 585 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 28,818కి చేరింది. మరోపక్క గురువారం కరోనా కారణంగా 23 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,721 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తంగా 8,8892 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 18,205 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇండొనేషియాలో నమోదైన కేసులను చూస్తే.. ప్రతి పది లక్షల మందిలో 105 మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అదే విధంగా ప్రతి పది లక్షల మందిలో ఆరుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇండొనేషియా ప్రభుత్వం ఇప్పటివరకు 3,67,640 కరోనా పరీక్షలను నిర్వహించింది. అంటే.. ప్రతి పది లక్షల మందిలో 1,345 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-06-04T23:42:25+05:30 IST