ఇండొనేషియాలో ఒక్కసారిగా పెరిగిన కేసులు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-06-07T08:22:11+05:30 IST

ఇండొనేషియాలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇండొనేషియాలో ఒక్కసారిగా పెరిగిన కేసులు.. కారణమేంటంటే..

జకార్తా: ఇండొనేషియాలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 993 కేసులు నమోదైనట్టు శనివారం ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండొనేషియాలో ఇప్పటివరకు మొత్తంగా 30,514 మంది కరోనా బారిన పడ్డారు. మరోపక్క కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,801కు చేరింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 9,907 మంది పూర్తిగా కోలుకున్నారు. మే నెల మొదట్లోనే ఇండొనేషియా ప్రభుత్వం దేశీయ ప్రయాణాలకు అనుమతులిచ్చింది. మార్చి నెలలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించగా.. ఆ తర్వాత మే 29 వరకు పొడిగిస్తూ వచ్చింది. కాగా.. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 67,97,633 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,96,388 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. 


Updated Date - 2020-06-07T08:22:11+05:30 IST