ప్రారంభమైన ఇండో-నేపాల్ రైలు సర్వీస్.. ప్రయాణంలో ఏమి కనిపిస్తాయంటే..

ABN , First Publish Date - 2022-04-03T15:36:09+05:30 IST

భారతదేశం, నేపాల్ మధ్య కొత్త రైలు సేవ...

ప్రారంభమైన ఇండో-నేపాల్ రైలు సర్వీస్.. ప్రయాణంలో ఏమి కనిపిస్తాయంటే..

భారతదేశం, నేపాల్ మధ్య కొత్త రైలు సేవ (ఇండో-నేపాల్ రైలు ) ప్రారంభమయ్యింది. బీహార్‌లోని జయనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా మధ్య ఈ రైలు ప్రయాణం సాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఈ నూతన రైలు సేవను ప్రారంభించారు. దేశ సమగ్రాభి వృద్ధిలో రైల్వేల పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.  రైల్వేలు పర్యాటక సాధనంగా మారుతాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సంక్షోభ సమయాల్లో మద్దతుగా నిలుస్తాయి. కాగా హిమాలయాలలోని అందమైన మైదానాలలో ఉన్న నేపాల్‌కు ఇప్పటివరకు రైలు సేవలు అందుబాటులో లేవు.


'నైబర్ ఫస్ట్ పాలసీ' కింద పొరుగు దేశం నేపాల్‌లో రైలు సేవలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ తన కట్టుబాటును ప్రకటించారు. ప్రధాని మోదీ కృషితో నేపాల్ ప్రజల కల నెరవేరింది. బీహార్‌లోని మధుబని జిల్లాలోని జయనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా మధ్య ఈ రైలు సర్వీసు 65 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. జయనగర్, కుర్తా, బిజల్‌పురా, బద్రిబాస్ మధ్య నున్న ఈ రైల్వే సెక్షన్ ఏర్పాటుకు మొత్తం 9 బిలియన్ నేపాలీ రూపాయలు ఖర్చయ్యింది. ఇందుకు భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగానూ సహకారం అందించింది. కుర్తా దాటి 17 కి.మీల దూరం వెళ్లే బిజల్‌పురా వరకు భారత ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేసింది. బిజల్‌పురా తర్వాత, నేపాల్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కోసం భూమిని అప్పగించి కొత్త లైన్ నిర్మించింది. జయనగర్.. ఇండో-నేపాల్ సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో నేపాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జనక్‌పూర్ జలపాతం ఉంది. ఇది జయనగర్‌కు నుండి 29 కి.మీ దూరంలో ఉంది. ఇది నేపాల్‌లో నిర్మించిన మొట్టమొదటి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్. ఐఆర్సీఓన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్‌కు అనుబంధ శాఖ. 2014లో ప్రధాని మోదీ తన మొదటి నేపాల్ పర్యటనలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. కాగా ఫిబ్రవరి 13 నుంచి ట్రయల్ రన్ నిర్వహించినట్లు నేపాల్ రైల్వే కంపెనీ జనరల్ మేనేజర్ నిరంజన్ ఝా తెలిపారు. భారతదేశం, నేపాల్ మధ్య రైలు సేవల ప్రారంభంతో రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. భారతదేశంలో రైల్వేలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు, రైల్వేల విస్తారమైన నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 1 లక్షా 15 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది.

Updated Date - 2022-04-03T15:36:09+05:30 IST