వచ్చే వారం నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2020-08-15T00:02:07+05:30 IST

ఈ నెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేట్ విమానయాన

వచ్చే వారం నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు

హైదరాబాద్: ఈ నెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో సిద్ధమైంది. ఈ మేరకు సిటీ ఎయిర్ పోర్టు డీజీ సాల్వే శుక్రవారం తెలిపారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది. మే నెలాఖరులో పాక్షికంగా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. 


జూన్ 19 నుంచి వారానికి మూడుసార్లు న్యూఢిల్లీ-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించినట్టు సాల్వే తెలిపారు. అలాగే, మరో విమానయాన సంస్థ గత నెలలో హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య వారానికి నాలుగుసార్లు విమాన సర్వీసులు ప్రారంభించినట్టు వివరించారు.


వారంలో రెండుసార్లు న్యూఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానాన్ని నడుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్-హైదరాబాద్ మధ్య ఇండిగో ప్రతి రోజూ విమానాలు నడపనున్నట్టు సాల్వే తెలిపారు.  

Updated Date - 2020-08-15T00:02:07+05:30 IST