India-UAE flights: యూఏఈకి ఇండిగో కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-23T13:53:41+05:30 IST

భారతీయ లోబడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) గురువారం ముంబై నుంచి రాస్ అల్ ఖైమాకు (Ras Al Khaimah) తన తొలి విమాన సర్వీసును నడిపింది.

India-UAE flights: యూఏఈకి ఇండిగో కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

ఎన్నారై డెస్క్: భారతీయ లోబడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) గురువారం ముంబై నుంచి రాస్ అల్ ఖైమాకు (Ras Al Khaimah) తన తొలి విమాన సర్వీసును నడిపింది. రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (Ras Al Khaimah International Airport) నుండి రోజువారీ విమాన సర్వీసులను 625 దిర్హమ్స్(రూ.13,799) ప్రారంభ ధరతో ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ పేర్కొంది. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా యువరాజు షేక్ మహమ్మద్ బిన్ సౌధ్ సకర్ అల్ ఖాసిమి (Sheikh Mohammed bin Saud bin Saqar Al Qasimi), రాస్ అల్ ఖైమా ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్‌లో ల్యాండ్ అయిన ఇండిగో తొలి విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త సీఈఓ పీటర్ ఎల్బర్స్‌తో సహా ముంబై నుంచి 180 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎల్బర్స్ మాట్లాడుతూ.. “ఇది ఇండిగో 6E నెట్‌వర్క్‌లో 100వ గమ్యస్థానం (రాస్ అల్ ఖైమా) మరియు నాల్గొ ఎమిరేట్ కంట్రీ. ఇక భారతదేశంలో ఇండిగో ఇప్పటికే దేశవ్యాప్తంగా 74 నగరాలకు విమానాలు నడుపుతూ వివిధ కమ్యూనిటీలకు సేవలు అందిస్తోంది” అని చెప్పారు.

Updated Date - 2022-09-23T13:53:41+05:30 IST