ఇండిగో విమానాలపై యూఏఈ బ్యాన్ !

ABN , First Publish Date - 2021-08-19T20:10:07+05:30 IST

భారత్‌కు చెందిన బడ్జెట్ క్యారియర్ ఇండిగో విమాన సర్వీసులపై గల్ఫ్ దేశం యూఏఈ వారం రోజుల పాటు బ్యాన్ చేసింది. భారత్ నుంచి బయల్దేరే ముందు విమానాశ్రయంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆర్‌టీపీసీఆర్ టెస్టును ఇండిగో విమానాల్లో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తప్పించుకున్నట్లు తేలింది.

ఇండిగో విమానాలపై యూఏఈ బ్యాన్ !

అబుధాబి: భారత్‌కు చెందిన బడ్జెట్ క్యారియర్ ఇండిగో విమాన సర్వీసులపై గల్ఫ్ దేశం యూఏఈ వారం రోజుల పాటు బ్యాన్ చేసింది. భారత్ నుంచి బయల్దేరే ముందు విమానాశ్రయంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆర్‌టీపీసీఆర్ టెస్టును ఇండిగో విమానాల్లో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తప్పించుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే యూఏఈ ఇండిగో విమాన సర్వీసులపై వారం రోజుల పాటు బ్యాన్ వేసింది. ఇక భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన ప్రయాణికులకు యూఏఈ బయల్దేరడానికి 48 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేసింది.


అలాగే విమానం బయల్దేరడానికి కొన్ని గంటల ముందు విమానాశ్రయంలో కూడా మరో ర్యాపిడ్ టెస్టు చేయించుకోవడం కూడా తప్పనిసరి. కానీ, ఇండిగో కరోనా టెస్టు చేయించుకోని పలువురు ప్రయాణికులను యూఏఈకి తీసుకువచ్చినట్లు తేలింది. దాంతో ఆగస్టు 17 నుంచి 24 వరకు వారం రోజులు ఇండిగో విమాన సర్వీసులను యూఏఈ నిషేధించింది. ఈ నేపథ్యంలో ఇండిగో ప్రయాణికులకు కీలక సూచన చేసింది. ఆపరేషనల్ సమస్య కారణంగా యూఏఈకి వెళ్లాల్సిన విమాన సర్వీసులన్నింటినీ ఆగస్టు 24 వరకు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది.     

Updated Date - 2021-08-19T20:10:07+05:30 IST