ఒకే రోజు మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్...IndiGo విమానాన్ని ఢీకొన్న పక్షి

ABN , First Publish Date - 2022-06-20T12:51:18+05:30 IST

ఒకే రోజు మూడు విమానాలు పక్షుల దెబ్బకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....

ఒకే రోజు మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్...IndiGo విమానాన్ని ఢీకొన్న పక్షి

గౌహతి విమానాశ్రయంలోనే తిరిగి ల్యాండింగ్ 

గౌహతి (అసోం): ఒకే రోజు మూడు విమానాలు పక్షుల దెబ్బకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.మూడు వేర్వేరు ఘటనల్లో రెండు విమానాలను పైలెట్లు సురక్షితంగా ల్యాండింగ్ అయిన విమానాశ్రయాల్లోనే తిరిగి టేకాఫ్ చేయడంతో విమాన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీకి వెళ్లే ఇండిగో ఎయిర్‌బస్ విమానం టేకాఫ్ తర్వాత పక్షి దెబ్బకు గురై గౌహతికి తిరిగి వచ్చింది.‘‘ఇండిగో ఎయిర్‌బస్ ఎ 320 నియో వీటీ ఐటీబీ (VT-ITB) గౌహతి-ఢిల్లీ నుంచి 6ఈ 6394 విమానాన్ని నడుపుతోంది, టేకాఫ్ తర్వాత విమానాన్ని పక్షి ఢీకొన్నందున గౌహతి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ప్రయాణీకులందరికీ ఢిల్లీకి వెళ్లేందుకు మరో విమానంలో వసతి కల్పించారు.పక్షి ఢీకొన్న ఇండిగో విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.


అంతకుముందు ఆదివారం రాత్రి జబల్‌పూర్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానం 6,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పటికీ క్యాబిన్ ప్రెజర్ డిఫరెన్షియల్‌ను తిరిగి పొందడంలో విఫలమవడంతో తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.పట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఓ స్పైస్‌జెట్‌ విమాన ఇంజన్‌కు మంటలంటుకున్నాయి. ప్రయాణికులు, కేబిన్‌ సిబ్బంది గమనించి పైలట్లను అప్రమత్తం చేశారు. టేకాఫ్‌ సమయంలో ఓ పక్షి ఢీకొనడం వల్లే ఇంజన్‌లో మంటలు చెలరేగాయని స్పైస్‌జెట్‌ వివరించింది.విమానంలో సాంకేతిక లోపం గురించి ఇంజినీరింగ్ బృందం మరింత విశ్లేషిస్తోందని విమానయాన అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-06-20T12:51:18+05:30 IST