5 దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తీసుకొచ్చిన ఇండిగో విమానం

ABN , First Publish Date - 2021-05-06T11:33:36+05:30 IST

ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానం ఐదు దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు తీసుకొచ్చింది. థాయ్‌ల్యాండ్, చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఖతార్ దేశాల నుంచి 2,717 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఈ విమానం మన దేశానికి తీసుకొచ్చింది.

5 దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తీసుకొచ్చిన ఇండిగో విమానం

న్యూఢిల్లీ: ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానం ఐదు దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు తీసుకొచ్చింది. థాయ్‌ల్యాండ్, చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఖతార్ దేశాల నుంచి 2,717 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఈ విమానం మన దేశానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో చాలా మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చాలా ముఖ్యం. అందుకే చాలా దేశాలు వీటిని భారత్‌కు పంపడానికి అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలో ఇండిగో ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము దేశంలో కూడా సుమారు 36 ఎయిర్‌పోర్టుల మధ్య 1425 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లామని చెప్పారు. వీటితోపాటు భారీ మొత్తంలో ఇతర మెడికల్ సప్లైలను కూడా రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-06T11:33:36+05:30 IST