UAE-India flights: యూఏఈకి ఇండిగో మరో డైరెక్ట్ విమాన సర్వీస్.. ఎప్పట్నుంచంటే..

ABN , First Publish Date - 2022-08-11T14:24:12+05:30 IST

భారత బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. రాస్ అల్ ఖైమా(Ras Al Khaimah)కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.

UAE-India flights: యూఏఈకి ఇండిగో మరో డైరెక్ట్ విమాన సర్వీస్.. ఎప్పట్నుంచంటే..

ఇంటర్నెట్ డెస్క్: భారత బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. రాస్ అల్ ఖైమా(Ras Al Khaimah)కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 22 ఈ కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇది 6E నెట్‌వర్క్‌లో క్యారియర్‌కు సంబంధించి 100వ గమ్యస్థానం(రాస్ అల్ ఖైమా) అని సంస్థ ప్రధాన రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. “మా 26వ అంతర్జాతీయ గమ్యస్థానం, నాల్గవ ఎమిరేట్ రాస్ అల్ ఖైమాకు కొత్త విమాన సర్వీస్ ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఈ కొత్త విమానాలు భారత ప్రయాణికుల నుంచి రాస్ అల్ ఖైమాకు ఉన్న అధిక డిమాండ్‌ను తీరుస్తాయి. కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ట్రాఫిక్ ఈ సంవత్సరం ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకుంటుందనేది మా అంచనా. పెరిగిన కనెక్టివిటీ వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా దేశాల మధ్య స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని బలోపేతం చేయడం మా లక్ష్యం" అని సంజయ్ కుమార్ అన్నారు. 


పౌర విమానయాన శాఖ రస్ అల్ ఖైమా, రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చైర్మన్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమీ మాట్లాడుతూ.. “ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయ భాగస్వామ్యం సాధారణ స్థితికి తిరిగి రావడం ఒక ముఖ్యమైన ముందడుగు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. భారత ఉపఖండం నుండి పెరిగిన ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. అభివృద్ధి చెందుతున్న రాస్ అల్ ఖైమా పర్యాటక, పారిశ్రామిక రంగం ఈ కనెక్టివిటీ నుండి ప్రయోజనం పొందుతుంది. విమానాశ్రయం కోసం కొనసాగుతున్న విస్తరణ వ్యూహంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన భాగం అని విశ్వసిస్తున్నట్లు" ఖాసిమీ తెలిపారు.  

Updated Date - 2022-08-11T14:24:12+05:30 IST