India Vs australia: టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత ఏం ఎంచుకుందంటే.. పంత్‌కు దక్కని చోటు

ABN , First Publish Date - 2022-09-26T00:12:01+05:30 IST

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs australia) టీ20 సిరీస్‌‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పడింది.

India Vs australia: టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత ఏం ఎంచుకుందంటే.. పంత్‌కు దక్కని చోటు

హైదరాబాద్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs australia) టీ20 సిరీస్‌‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండవ మ్యాచ్‌లో ఆడిన రిషబ్ పంత్‌ను ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టి పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడుతుండడం సంతోషంగా ఉందని, జనసందోహం మధ్య మ్యాచ్ ఆడబోతున్నామని చెప్పారు. గత మ్యాచ్ మాదిరిగా రాణించేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ చెప్పారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే  3 మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోనుంది. 


ఇండియా తుది జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్.


ఆస్ట్రేలియా తుది జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), కెమరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జాష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ వేడ్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జాస్ హేజెల్‌వుడ్.


Updated Date - 2022-09-26T00:12:01+05:30 IST