100కి చేరువలో ఒమైక్రాన్ కేసులు,ఢిల్లీలో కొత్తగా 10

ABN , First Publish Date - 2021-12-17T20:28:59+05:30 IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల..

100కి చేరువలో ఒమైక్రాన్ కేసులు,ఢిల్లీలో కొత్తగా 10

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలో 20కి చేరుకోగా, వీరిలో పది మంది డిశ్చార్చ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసుల సంఖ్య 97కి చేరింది. ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చిన పేషెంట్లు ఎవరెవరిని కాంట్రాక్ట్ చేశారో గుర్తించే ప్రయత్నం  చేస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఈనెల 5న తొలి ఒమైక్రాన్ పాజిటివ్ కేసును ఢిల్లీలో గుర్తించారు. సోమవారం అతన్ని డిశ్చార్చ్ చేశారు. ఈనెల 2న అతను టాంజానియా నుంచి దోహాకు, అక్కడి నుంచి ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అతను ఢిల్లీకి వచ్చినట్టు గుర్తించారు. అతను సౌత్‌ ఆఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో వారం రోజులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒమైక్రాన్ వైరస్ సోకిన అనుమానంతో ప్రస్తుతం లోక్‌నాయక్ ఆసుపత్రిలో 40 మందికి చికిత్స అందిస్తున్నట్టు మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.


కాగా, దేశంలో తొలి ఒమైక్రాన్ కేసును ఈనెల 2న కర్ణాటకలో గుర్తించారు. ఇంతవరకూ, దేశంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 32 కేసులు, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో 20, కర్ణాటకలో 8, గుజరాత్, కేరళలో చెరో ఐదు, తెలంగాణలో 6, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-12-17T20:28:59+05:30 IST