happy independence day : భూమికి 30 కి.మీ ఎత్తులో తిరంగా జెండా.. అద్భుత వీడియోను మీరూ చూసేయండి..

ABN , First Publish Date - 2022-08-15T22:51:21+05:30 IST

దేశవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్కూలుకెళ్లే చిన్నారుల నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.

happy independence day : భూమికి 30 కి.మీ ఎత్తులో తిరంగా జెండా.. అద్భుత వీడియోను మీరూ చూసేయండి..

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు( independence day Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్కూలుకెళ్లే చిన్నారుల నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. 75 ఏళ్ల దేశ కీర్తిపతానికి ఆకాశమే హద్దు అన్నట్టు    అంతరిక్షానికి సమీపాన తిరంగా జెండా సగర్వంగా ఎగురుతోంది. పెద్ద బెలూన్ సహాయంతో స్పేస్ కిడ్స్ ఇండియా (Space Kidz India) పంపించిన ఈ  జాతీయ పతాకం  భూమికి 30 కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్షం అంచున రెపరెపలాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ కిడ్స్ ఇండియా ట్విటర్‌లో(Twitter) పోస్ట్ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా జెండాను  పంపించారు. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ వేళ అత్యద్భుతమైన ఈ వీడియోను మీరూ చూసేయండి..



Updated Date - 2022-08-15T22:51:21+05:30 IST