సూది రహిత కోవిడ్ వ్యాక్సిన్ ZyCov-D...పాట్నాలో ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-05T12:44:21+05:30 IST

భారతదేశపు మొట్టమొదటి సూది రహిత కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి పాట్నాలో ప్రారంభించారు...

సూది రహిత కోవిడ్ వ్యాక్సిన్ ZyCov-D...పాట్నాలో ప్రారంభం

పాట్నా(బీహార్): భారతదేశపు మొట్టమొదటి సూది రహిత కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి పాట్నాలో ప్రారంభించారు.పాట్నా నగరంలో ఈ కార్యక్రమం మూడు టీకా కేంద్రాల్లో ప్రారంభించారు. సూదుల భయంతో వ్యాక్సిన్‌లు తీసుకోకుండా ఉన్న వ్యక్తులకు ఇది ఉపయోగపడుతుందని సివిల్ సర్జన్ డాక్టర్ విభా సింగ్ చెప్పారు.జైకోవ్-డి అనేది కోవాక్సిన్ తర్వాత భారతదేశంలోని రెండవ దేశీయ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇది సూదులు లేని వ్యాక్సిన్. దీన్ని ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేశారు.జైకోవ్-డి వ్యాక్సిన్ ను 12 నుంచి 15 ఏళ్ల వయసు గల పిల్లలకు ఇవ్వాలని ఆమోదించారు. జైకోవ్ డిని ఫార్మాస్యూటికల్ దిగ్గజం జైడస్ కాడిలా తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను 28 రోజుల నుంచి 56 రోజుల వ్యవధిలో మూడు మోతాదుల్లో వేయనున్నారు.


Updated Date - 2022-02-05T12:44:21+05:30 IST