మనోళ్లే టాప్.. బ్రిటన్‌ వీసాల్లో అధిక శాతం భారతీయులకే..!

ABN , First Publish Date - 2022-03-23T02:59:51+05:30 IST

నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే బ్రిటన్ వీసాల్లో అధిక శాతం భారతీయులే సొంతం చేసుకుంటున్నట్టు తాజాగా తేలింది. ‘‘గతేడాది..65,500 స్కిల్డ్ వర్కర్ వీసాలను భారతీయులకు జారీ చేశాం’’ అని బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. 2019లో జారీ అయిన వీసాల సంఖ్యతో పోలిస్తే..

మనోళ్లే టాప్.. బ్రిటన్‌ వీసాల్లో అధిక శాతం భారతీయులకే..!

ఎన్నారై డెస్క్:  నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే బ్రిటన్ వీసాల్లో అధిక శాతం భారతీయులే సొంతం చేసుకుంటున్నట్టు తాజాగా తేలింది. ‘‘గతేడాది..65,500 స్కిల్డ్ వర్కర్ వీసాలను భారతీయులకు జారీ చేశాం’’ అని బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. 2019లో జారీ అయిన వీసాల సంఖ్యతో పోలిస్తే.. ఇది దాదాపు 14 శాతం అధికం. బ్రిటన్‌లో అమలవుతున్న పాయింట్స్ ఆధారిత వలసల వ్యవస్థ పాపులారిటీకి ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. 


ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కిల్డ్ వర్కర్ వీసా పొందాలంటే..

  1. బ్రిటన్ కంపెనీలో ఉద్యోగం ఉండాలి. 
  2. కంపెనీలో వీసాదరఖాస్తు దారుడు చేయబోయే ఉద్యోగం ఏమిటో తెలుపుతూ కంపెనీ యాజమాన్యం సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ పేరిట ఓ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. 
  3. వీసాదరఖాస్తు దారుడు చేయబోయే ఉద్యోగం ప్రభుత్వం అనుమతించిన వృత్తుల జాబితాలో ఉండాలి. 
  4. ఆయా ఉద్యోగాలను బట్టి.. ప్రభుత్వం పేర్కొన్న కనీస మొత్తాన్ని శాలరీగా పొందాలి. 

అయితే.. వలసలకు సంబంధించిన నిబంధనలు మరింత సరళతరం చేసేందుకు బ్రిటన్, భారత్‌ ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య చర్చల్లో భాగంగా రెండు దేశాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయి.  ఇక గత ఏడాది..ఇరు దేశాల ప్రభుత్వాలు ఇండియా-యూకే మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పేరిట ప్రజల రాకపోకలను ప్రోత్సహించేలా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం..  మొత్తం 3 వేల మంది విద్యార్థులు, యువవృత్తినిపుణులకు బ్రిటన్, భారత్‌లో ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 

Updated Date - 2022-03-23T02:59:51+05:30 IST