ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయుల డేటా లీక్‌?

ABN , First Publish Date - 2020-05-27T07:55:58+05:30 IST

దిగ్గజ కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ యాప్‌ ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయ యూజర్ల డేటా లీకైందని సైబర్‌

ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయుల డేటా లీక్‌?

  • డార్క్‌ వెబ్‌లో రూ. 75 వేలకు అమ్మకానికి

న్యూఢిల్లీ, మే 26: దిగ్గజ కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ యాప్‌ ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయ యూజర్ల డేటా లీకైందని సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘సైబెల్‌’ వెల్లడించింది. హ్యాకర్లు ఆ డేటాను రూ.75 వేల కు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారని పేర్కొంది. 2019కు ముందున్న డేటాను డార్క్‌వెబ్‌లో పెట్టారని తెలిపింది. అయితే.. ట్రూకాలర్‌ ఆరోపణలను ఖండించింది. ‘‘మా సర్వర్లు, డేటాబేస్‌ పటిష్ఠంగా ఉన్నాయి. 2019లో కూడా ఇలాంటి ఉదంతమే బయటపడింది. అప్పుడూ డేటా లీక్‌ కాలేదని తేలింది’’ అని పేర్కొంది.

Updated Date - 2020-05-27T07:55:58+05:30 IST