భారతీయులకు యూఏఈ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-08-23T11:40:51+05:30 IST

పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు పర్యాటక వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని చెప్పింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్‌, నైజీరియా, పాకిస్థాన్‌, శ్రీలంక..

భారతీయులకు యూఏఈ గుడ్‌న్యూస్

పర్యాటక వీసాలపై భారతీయులు రావచ్చు

గత 14 రోజులు విదేశాల్లో ఉన్న వారికే అవకాశం: యూఏఈ

దుబాయి, ఆగస్టు 22: పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు పర్యాటక వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని చెప్పింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్‌, నైజీరియా, పాకిస్థాన్‌, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2021-08-23T11:40:51+05:30 IST