విదేశాల నుంచి వచ్చి చిక్కుకున్న భారతీయులకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-08-14T21:56:28+05:30 IST

విదేశాల నుంచి భారత్‌కు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

విదేశాల నుంచి వచ్చి చిక్కుకున్న భారతీయులకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వివిధ పనులపై వచ్చిన వీరంతా కరోనా కారణంగా అనేక నెలలుగా దేశంలోనే ఉండాల్సి వచ్చింది. ఇక వీరికి తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కింద భారతదేశం నుంచి ఆయా దేశాలకు.. ఆయా దేశాల నుంచి భారతదేశానికి ప్రయాణించే అవకాశం లభించింది. ఇక ఈ ఎయిర్ బబూల్ ఒప్పందం కింద అమెరికా, యూకే, కెనడా, యూఏఈకి వెళ్లవచ్చంటూ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఎయిర్ బబూల్ ఒప్పందం కింద వ్యాలిడ్ వీసా కలిగి ఉన్న భారతీయులు ఈ నాలుగు దేశాలకు ప్రయాణించవచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకోనున్నట్టు విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై కేంద్రం విధించిన ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. కేవలం అత్యవసర వీసా కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం దేశంలోకి అనుమతి ఉందని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

Updated Date - 2020-08-14T21:56:28+05:30 IST