ఉక్రెయిన్ వీడాలంటూ భారతీయులకు సూచన! 3 రోజుల పాటు విమాన సర్వీసులు సిద్ధం..!

ABN , First Publish Date - 2022-02-20T02:37:38+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో సద్దుమణగని నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ అక్కడి భారతీయ ఎంబసీ తాజాగా మరోసారి సూచించింది.

ఉక్రెయిన్ వీడాలంటూ భారతీయులకు సూచన! 3 రోజుల పాటు విమాన సర్వీసులు సిద్ధం..!

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో సద్దుమణగని నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ అక్కడి భారతీయ ఎంబసీ తాజాగా మరోసారి సూచించింది. మరోవైపు.. ఫ్రిబవరి 22, 24, 26 తేదీల్లో భారత్, ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. చదువు కుంటుపడుతుందనే భయంతో అనేక మంది ఉక్రెయిన్‌ వీడేందుకు జంకుతున్నట్టు సమాచారం.


అక్కడి విద్యార్థులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ఓ హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. చాలా మంది తమను సంప్రదిస్తున్నారని , అయితే.. క్లాసులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అత్యధిక శాతం మంది స్వదేశానికి తిరిగొచ్చేందుకు వెనకాడుతున్నారని తెలిపారు. తాము సురక్షితంగానే ఉన్నట్టు వారు పేర్కొన్నారని కూడా సదరు అధికారి చెప్పారు. కాగా.. బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానసర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. సంస్థ బుకింగ్ ఆఫీసర్ ద్వారా లేదా వెబ్‌సైట్, కాల్ సెంటర్, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-02-20T02:37:38+05:30 IST