Abn logo
Feb 27 2021 @ 09:45AM

సింగపూర్‌లో భారతీయ జంటకు జైలు.. చేసిన నేరమిదే!

సింగపూర్: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సింగపూర్‌లో భారత సంతతి మహిళ, ఆమె బ్రిటీష్ భర్తకు అక్కడి అధికారులు శుక్రారం కటకటాల వెనక్కి నెట్టారు. భారతీయ మహిళ అగాథ మఘేష్ ఇయమలై(49)కు వారం రోజుల జైలు, ఆమె భర్త నిగెల్ స్కీయా(52)కు రెండు వారాల జైలుతో పాటు 1000 సింగపూర్ డాలర్లు(రూ.55వేలు) జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే... గతేడాది సెప్టెంబర్‌లో నిగెల్ పని మీదా లండన్ నుంచి సింగపూర్ వెళ్లారు. ఆ సమయంలో ఆయనను అక్కడి అధికారులు హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కానీ, బిజినెస్ పని మీదా సింగపూర్ వచ్చిన భార్య అగాథను కలిసేందుకు నిగెల్.. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి హోటల్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ జంటపై క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు అధికారులు. తాజాగా ఈ కేసు సింగపూర్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో దంపతులను దోషిగా తేల్చిన జడ్జి జశ్వేందర్ కౌర్ ఇద్దరికి జైలు శిక్షను ఖరారు చేసింది.   

Advertisement
Advertisement
Advertisement