Canada: కెనడాలో పంజాబీ మూలాలున్న వ్యక్తిపై దాడి..!

ABN , First Publish Date - 2022-08-14T02:53:13+05:30 IST

కెనడాలోని(Canada) పంజాబీ మూలాలున్న ఓ వ్యక్తిపై దాడి(Attack) జరిగింది. బాధితుడు తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ముగ్గురు ఆగంతుకులు పదునైన ఆయుధాలతో అతడిపై దాడికి దిగినట్టు పోలీసులు తెలిపారు.

Canada: కెనడాలో పంజాబీ మూలాలున్న వ్యక్తిపై దాడి..!

ఎన్నారై డెస్క్: కెనడాలోని(Canada) పంజాబీ మూలాలున్న ఓ వ్యక్తిపై దాడి(Attack) జరిగింది. బాధితుడు తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ముగ్గురు ఆగంతుకులు పదునైన ఆయుధాలతో అతడిపై దాడికి దిగినట్టు పోలీసులు తెలిపారు. బ్రాంప్టన్(Brampton) అనే ప్రాంతంలో ఈ దారుణం వెలుగు చూసింది.  సిక్కు మతస్తులనే లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ ఘుతాకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని జ్యోతీ సింగ్ మాన్‌గా గుర్తించారు. జ్యోతి సింగ్ మాన్ స్థానిక పంజాబీ రేడియో షోలో యాంకర్‌గా వ్యవహరిస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన ఆయన ఇటీవల తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ముష్కరులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. 


కారు వద్ద నుంచి ఆయనను రోడ్డుపై చేయి చేసుకుంటూ లాక్కుని వచ్చారు. ఇదంతా అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం జ్యోతి సింగ్ మాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా.. బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘కెనడాలోని సిక్కు మతస్తులపై వరుసగా దాడులు జరగడం ఆందోళన కరమని అభివర్ణించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కెనడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2022-08-14T02:53:13+05:30 IST