India-New Zealand Test: కష్టాల్లో టీమిండియా..పట్టుబిగించిన కివీస్

ABN , First Publish Date - 2021-11-28T16:45:11+05:30 IST

న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 14/1తో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ జట్టు కష్టాల్లో పడింది. 68 పరుగులకే 5 కీలక వికెట్లను

India-New Zealand Test: కష్టాల్లో టీమిండియా..పట్టుబిగించిన కివీస్

కాన్పూర్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 14/1తో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ జట్టు కష్టాల్లో పడింది. 68 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో తొలి టెస్టు సిరీస్‎పై కివీస్ జట్టు నాల్గవ రోజు పట్టుబిగించింది. న్యూజిలాండ్ బౌల్లర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నయా వాల్ పుజారా 32 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానే కూడా 4 పరుగులు మాత్రమే చేసి అజాజ్ పటేల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుటయి నిరాశపరిచాడు.

క్రీజులో నిలదొక్కుకున్నాడని అనుకున్న మయాంక్ అగర్వాల్ కూడా 17 రన్స్ చేసి సౌథీ బౌలింగ్‎లో లాథమ్‎కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. దీంతో భారత్ పీకల్లోతూ కష్టాల్లోపడింది. శ్రేయాస్ అయ్యర్ 17, రవిచంద్రన్ అశ్విన్ 12 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. టీమిండియా ఆధిక్యం 122 పరుగులు ఉంది.

Updated Date - 2021-11-28T16:45:11+05:30 IST